Magazines

రేపు సీజేపీ ధర్నా.. సుప్రీం కీలక వ్యాఖ్యలు

1 గంట క్రితం

sc
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 09, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: రేపు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టనున్న నిరసనకు సంబంధించి ఢిల్లీ పోలీసులు విధించిన కఠిన పరిమితులపై సుప్రీం అభ్యంతరం వ్యక్తం చేసింది.   శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఢిల్లీ మెట్రో 57 స్టేషన్లను మూసివేయాలన్న నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మెట్రో స్టేషన్ల మూసివేత సాధారణ పౌరుల హక్కులను దెబ్బతీస్తుందని పేర్కొంది. ఆందోళనలకు, ప్రజల సౌకర్యాల మధ్య బ్యాలెన్స్ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. 


ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ అక్టోబర్ 10న ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ర్యాలీకి సిద్ధమైన విషయం తెలిసిందే.   దీనికి సంబంధించి 20 వేలకు   పైగా పోలీసు, పారామిలటరీ సిబ్బందిని  ఢిల్లీలో మోహరించారు. పోలీసులు మెట్రో స్టేషన్ల మూసివేత, రైళ్ల రద్దు, సరిహద్దు చెక్‌లు, హోటళ్లలో కొత్త బుకింగ్‌లు నిలిపివేత వంటి చర్యలు తీసుకున్నారు. 


 

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్