Magazines

తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన చికెన్ ధరలు

2 గంటల క్రితం

chicken
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 11, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : పండగల సీజన్ ఎఫెక్ట్‌తో తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. గత రెండు వారాల్లో కిలో చికెన్ ధర రూ.50కి పైగా పెరిగి, ప్రస్తుతం రూ.280 నుంచి రూ.300 వరకు పలుకుతోంది. హైదరాబాద్‌లో ప్రస్తుతం కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.278గా ఉండగా.. డ్రస్స్‌డ్ చికెన్ ధర రూ.246గా ఉంది. ఇక ఎక్స్ ఫారం లైవ్ బర్డ్ ధర రూ.132గా ఉండగా.. రిటైల్ లైవ్ బర్డ్ రూ.159గా కొనసాగుతోంది. విజయవాడలో కిలో స్కిన్ లెస్ చికెన్ రూ.284గా ఉండగా.. డ్రస్స్‌డ్ చికెన్ రూ.251గా ఉంది. రిటైల్ లైవ్ బర్డ్ రూ.162, ఫారం దగ్గర లైవ్ బర్డ్ రూ.135 వద్ద కొనసాగుతోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్