Magazines

కవిత్వం సరళంగా రాయడమే కష్టం : వారాల ఆనంద్

1 గంట క్రితం

kavisangama
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 11, 2026 | 2 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : కవిత్వం సరళంగా రాయడమే కష్టం అని ప్రముఖ కవి వారాల ఆనంద్ అన్నారు. కవిసంగమం కవి యాకూబ్ ఆధ్వర్యంలో 'రెండుతరాల కవిసంగమం' సిరీస్ లో భాగంగా సుల్తాన్ బజార్ శ్రీకృష్ణదేవరాయల భాషా నిలయంలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని యువకవి పేర్లరాము సమన్వయం చేశారు. ప్రముఖ కవి కేంద్రసాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత వారాల ఆనంద్ సీనియర్ కవిగా పాల్గొని మాట్లాడుతూ కవులుగా విస్తృతంగా అధ్యయనం అవసరం, ఇతర భాషల కవిత్వం చదవాలి. నిరంతరం పునః పరిశీలన చేసుకోవాలి, సమాజం కేంద్రంగా కవిత్వం మరింత రావాలని అన్నారు. తన కవిత్వ అనుభవాలను కవిత్వాన్ని వినిపించారు. సభావట్ హథీరాం మాట్లాడుతూ తండా నుండి కాకతీయ విశవిద్యాలం నుండి చాలా నేర్చుకున్నాను. అక్కడ నుండి కవిత్వం రాయడం మొదలెట్టాను. నల్లింకుపెన్ను, నీలం రంగు నది పుస్తకాలు వెలువరిచాను, తండాను సమాజాన్ని కవిత్వం చేస్తున్నాను అని కవిత్వం వినిపించారు. చిట్ల ప్రేమ్ కుమార్ గ్రామీణ జీవితాన్ని తెలంగాణ నుండికారంతో అనేక జీవిత కదలికలను కవిత్వం చదివి వినిపించారు. మామిడిపల్లి ఇంద్రాణి కుటుంబ సంబంధాలను, జీవితాన్ని కవిత్వం చేశారు. ఎరుకలి భాషకు లిపిని కనిపెట్టిన రీతిని చెప్పారు. తమదైన సంతకపు కవితలు చదివి వినిపించారు. వినోద్ కులం, వర్గం సంబంధిత నేపథ్యంలో కవితలు చదివి ఆకట్టుకున్నారు. ఈ సభలో బండారు రాజ్ కుమార్ మాట్లాడుతూ కవిత్వంగా కలుసుకోవడం అవసరం. ఎక్కడెక్కడి ప్రాంతాల నుండి వచ్చి రెండు తరాలు కవితలు వినిపించడం బావుందని కవితలు చదివిన కవుల ప్రత్యేకను చెప్పారు. ఊరూర కవిసంగమం కార్యక్రమాన్ని గుర్తు చేసుకున్నారు. తగుళ్ల గోపాల్ మాట్లాడుతూ కవిసంగమంలో కవిత్వం చదవడం గొప్ప అనుభూతి అని తాను పాల్గొన్న 2017 సిరీస్ ని జ్ఞాపకం చేసుకున్నారు. కవి సంగమం చేస్తున్న కృషిని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో కోప్పర్తి మాస్టారు, తగుళ్ల గోపాల్, శ్రీరామ్ పుప్పాల, చందు శివన్న, శిలాలోలిత, కవులు, రచయితలు, యువకవులు, పరిశోధకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్