Magazines

రక్షణ మంత్రి పర్యటనలో కానిస్టేబుల్ గన్ మిస్‌ఫైర్

2 రోజుల క్రితం

Constable's gun misfires during Defense Minister's visit
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 07, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : విశాఖపట్నంలో అపశ్రుతి చోటుచేసుకుంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పర్యటన సందర్భంగా భద్రతా విధుల్లో ఉన్న ఓ పోలీస్ కానిస్టేబుల్ సర్వీస్ రైఫిల్ ప్రమాదవశాత్తు పేలింది. ఈ ఘటనలో కానిస్టేబుల్ అప్పలకొండ తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం విశాఖలోని ఐఎన్ఎస్ డేగా వద్ద ఈ సంఘటన జరిగింది.

రాజ్‌నాథ్ సింగ్ ప్రయాణించాల్సిన విమానం వద్ద ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ బెటాలియన్‌కు చెందిన ఆర్మ్‌డ్ రిజర్వ్ (ఏఆర్) కానిస్టేబుల్ అప్పలకొండ భద్రతా విధుల్లో ఉన్నారు. ఆ సమయంలో ఆయన చేతిలోని సెల్ఫ్ లోడింగ్ రైఫిల్ (ఎస్ఎల్‌ఆర్) అకస్మాత్తుగా పేలింది. ఈ ప్రమాదంలో బుల్లెట్ ఆయన ఛాతీ ఎడమవైపు భాగంలోకి దూసుకెళ్లింది.

పెద్ద శబ్దం వినపడటంతో భద్రతా సిబ్బంది, ఇతర అధికారులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న అప్పలకొండను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న సీనియర్ అధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించి, ప్రమాదం జరిగిన తీరుపై విచారణకు ఆదేశించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్