Magazines

జిల్లాల దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి: కేటీఆర్

4 గంటల క్రితం

ktr
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 09, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌:

ఈ నెల 10,11 తేదీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో జిల్లాల దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్ష‍ుడు కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన గురువారం హైదరాబాద్‌ నుంచి టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా నాయకులకు దిశానిర్దేశం చేశారు.


ప్రజల ముందుకే పరిపాలనను తీసుకురావాలన్న లక్ష‍్యంతో కేసీఆర్ ప్రభుత్వం గతంలో తెలంగాణలో ఉన్న 10 జిల్లాలను 33 జిల్లాలుగా ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. దీని ద్వారా మండల, గ్రామాల్లోని ప్రజలు జిల్లా కేంద్రాలకు ప్రయాణించాల్సిన దూరం 100-150 కిలోమీటర్ల నుంచి 10-50 కి.మీ తగ్గిందని పేర్కొన్నారు. అదేవిధంగా జిల్లా స్థాయిలో మౌలిక వసతులు, ప్రభుత్వ కార్యాలయాలు, వైద్య, విద్యా సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం లభించిందని చెప్పారు. అధికార వికేంద్రీకరణ, పరిపాలనా సంస్కరణల ద్వారా జరిగిన మార్పులను ప్రజలకు గుర్తు చేయాల్సిన బాధ్యత మనపై ఉందనీ, ఇందులో భాగంగా రెండు రోజుల పాటు జిల్లాల దశాబ్ది ఉత్సవాలను జరపాలని పేర్కొన్నారు.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్