Magazines

మెట్లబావుల పునరుద్ధరణ పనులపై హైడ్రా ఫోకస్‌

1 గంట క్రితం

Hydra
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 09, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని పురాతన మెట్ల బావులు పునరుద్ధరణకు హైడ్రా ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు పాతబస్తీలోని శివరాంపల్లిలో ఉన్న భుమ్ రుక్ –ఉద్‌–దౌలా చెరువు పునరుద్ధరణ తర్వాత ఇప్పుడు దాని కింద ఉన్న చారిత్రక ఊటబావిపై హైడ్రా దృష్టి సారించింది. సుమారు 1.50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ బౌలి చెరువుతోపాటు చారిత్రక ప్రాధాన్యం ఉన్నదేనని అధికారులు గుర్తించారు.


చెరువు పునరుద్ధరణ సమయంలోనే ఈ పురాతన బావి విషయాన్ని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌, సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారనీ, సీఎం ఆదేశాల మేరకు బావి పునరుద్ధరణకు చర్యలు ప్రారంభించినట్టు అధికారులు చెబుతున్నారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలు, చెత్త, మట్టి, ఒండ్రుమట్టి, దట్టమైన పిచ్చిమొక్కలతో నిండిపోయిన బావిని శుభ్రం చేసి, నీటి నిల్వ సామర్థ్యాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్