Magazines

నితిన్‌ ‘అలియాస్‌ రుక్మిణి’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

1 గంట క్రితం

Alias Rukmini
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 09, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలం-గాణ హైదరాబాద్‌: టాలీవుడ్‌ హీరో నితిన్‌ నటిస్తున్న కొత్త సినిమా ‘అలియాస్‌ రుక్మిణి’ విడుదల తేదీ ఖరారైంది. దర్శకుడు మురళీ కాంత్‌ దేవసోత్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమా డిసెంబర్‌ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ‘యునానిమస్‌ ప్రొడక్షన్స్‌’ శుక్రవారం ప్రకటించింది. అయితే సినిమాలో రుక్మిణి ఎవరు? అనే ప్రశ్నకు అక్టోబర్‌ 13న సమాధానం చెబుతామని మేకర్స్‌ ఆసక్తి పెంచారు. ఈ సినిమాను ప్రముఖ హీరో నాని సమర్పిస్తున్నారు. దీప్తి గంటా నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన టైటిల్‌ గ్లింప్స్‌తో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్