Magazines

రాష్ట్రపతిని కలవనున్న ఇండియా కూటమి నేతలు

1 గంట క్రితం

India Kutami
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 09, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) ఏకపక్ష నిర్ణయాలు, దేశంలో చోటుచేసుకుంటున్న ప్రస్తుత పరిణామాలు, ఎన్నికల కమిషనర్ల మధ్య నెలకొన్న విభేదాలపై ఫిర్యాదు చేసేందుకు ఇండియా కూటమి నేతలు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఇండీ కూటమి ప్రతినిధి బృందం నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనుంది. ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తిని దెబ్బతీసేలా సీఈసీ వ్యవహరిస్తున్న తీరును, కమిషనర్ల మధ్య తలెత్తిన భేదాభిప్రాయాలను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాలని కూటమి నేతలు నిర్ణయించారు. ఈ వ్యవహారంలో రాజ్యాంగబద్ధమైన జోక్యం చేసుకోవాలని వారు రాష్ట్రపతిని కోరనున్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్