నవతెలంగాణ - హైదరాబాద్: బాలీవుడ్ సీనియర్ నటుడు నానా పటేకర్ మృతిపై గోవా పోలీసులు కేసు నమోదు చేశారు. చట్టపరమైన ప్రక్రియలో భాగంగా అసహజ మరణం (అన్‌నేచురల్ డెత్) కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ‘భారతీయ నాగరిక్ సురక్షా సంహిత’ (బీఎన్‌ఎస్‌ఎస్) సెక్షన్ 194 కింద ఈ కేసు నమోదైంది. పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ నితిన్ నాయక్ దర్యాప్తు చేస్తున్నారు.
గోవాలోని డోనా పౌలా ప్రాంతంలో ఉన్న తన నివాసం నుంచి నానా పటేకర్‌ను మణిపాల్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు పంచనామా నిర్వహించనున్నారు. గోవా మెడికల్ కాలేజీలో నిర్వహించిన పోస్టుమార్టం నివేదికను పరిశీలించడంతో పాటు, నానా పటేకర్ కుటుంబ సభ్యులు, ఇతర సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలను నమోదు చేయనున్నారు. ఆయన మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.
నానా పటేకర్ మృతిపై గోవా పోలీసుల కేసు
56 నిమిషాల క్రితం

Shiva Kumar
ప్రచురించబడింది అక్టో 09, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)