నవతెలంగాణ - హైదరాబాద్: దసరా పండుగ అనగానే పిల్లలకు ఎక్కడ లేని సంతోషం వస్తుంది. బరువైన పుస్తకాల బ్యాగులు పక్కన పెట్టి హాయిగా ఆడుకోవచ్చని సంబరపడిపోతారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు ఇలాంటి సంతోషాన్నే ఇస్తూ రేపటి (అక్టోబర్ 10) నుంచే దసరా సెలవులు స్టార్ట్ అవుతున్నాయి. నిజానికి అకడమిక్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 12 నుంచి హాలిడేస్ ఇవ్వాలి. కానీ రేపు రెండో శనివారం, ఎల్లుండి ఆదివారం రావడంతో పిల్లలకు రెండు రోజుల ముందుగానే పండగ సెలవులు వచ్చేశాయి.
తెలంగాణ ప్రభుత్వం స్కూళ్లకు దాదాపు 13 రోజుల పాటు దసరా సెలవులు ప్రకటించారు. అక్టోబర్ 10 నుంచి మొదలై అక్టోబర్ 22 వరకు బడులకు సెలవులు ఉంటాయి. తిరిగి అక్టోబర్ 23న స్కూళ్లు తెరుచుకుంటాయి. జూనియర్ కాలేజీల విషయానికి వస్తే ఒకరోజు ముందే హాలిడేస్ ముగుస్తాయి. ఇంటర్ విద్యార్థులకు అక్టోబర్ 21 వరకే సెలవులు ఇచ్చారు. అక్టోబర్ 22న కాలేజీలు యథావిధిగా రన్ అవుతాయి. మరోవైపు దసరా పండుగతో పాటు తెలంగాణలో బతుకమ్మ పండుగ గ్రామీణ, పట్టణ కేంద్రాలలో అత్యంత వైభవంగా జరగనుంది.






కామెంట్‌లు (0)