Magazines

విషాదం.. ఉరేసుకుని కానిస్టేబుల్‌ ఆత్మహత్య

1 గంట క్రితం

Constable Suicide
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 09, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌: జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తాలో విషాద ఘటన చోటుచేసుకుంది. 10వ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు (27) ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ కలహాల కారణంగానే ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు పోలీసులు ప్రాథమికంగా తెలిపారు. వెంకటేశ్వర్లు మృతి కుటుంబం, తోటి సిబ్బందిని తీవ్ర విషాదంలో నింపింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్