Magazines

ట్యాంక్‌బండ్‌పై పుట్టినరోజు వేడుకలు వద్దు: సీపీ సజ్జనార్‌

1 గంట క్రితం

Cp Sajjanar
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 09, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్: ట్యాంక్ బండ్‌పై అర్ధరాత్రి పుట్టిన రోజు వేడుకలను జరుపుకోవద్దని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తల్లిదండ్రులు, యువతకు విజ్ఞప్తి చేశారు. అర్ధరాత్రి వేళల్లో రోడ్లపై జనసంచారం ఉండకపోవడంతో వాహనాలు మితిమీరిన వేగంతో దూసుకొస్తాయనీ, ఇది అత్యంత ప్రమాదకరమన్నారు. సంతోషంగా జరుపుకోవాల్సిన పుట్టినరోజు వేడుకలు క్షణికావేశం, నిర్లక్ష్యం వల్ల కుటుంబాలకు తీరని శోకాన్ని మిగులుస్తుండటం బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు.


రెండు రోజుల క్రితం అర్ధరాత్రి 2 గంటల సమయంలో ట్యాంక్‌బండ్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో పుట్టినరోజు నాడే ఓ యువతి మరణించిందని, ఆమె తండ్రి కూడా చనిపోవడంతో బాధాకరం అని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టేందుకు పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి ట్యాంక్ బండ్ పై ప్రమాద స్థలాన్ని పరిశీలించడం జరిగిందన్నారు. పుట్టినరోజు అనేది కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత వేడుక అని, దానిని ఇళ్ల వద్ద లేదా ఏదైనా సురక్షితమైన ప్రదేశాల్లో మాత్రమే జరుపుకోవాలని స్పష్టం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్