Magazines

అమెరికా శాంతి ప్రతిపాదనపై త్వరలో స్పందిస్తాం: ఇరాన్‌

39 నిమిషాల క్రితం

Araghchi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 09, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికా శాంతి ప్రతిపాదనకు ఇరాన్‌ త్వరలోనే స్పందిస్తుందని ఆ దేశ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చి గురువారం తెలిపారు. ఇరాన్‌పై అమెరికా సైనిక దాడులకు సిద్ధమవుతుందన్న వార్తల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గురువారం ఇరాన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో అరాగ్చీ పాల్గొని మాట్లాడారు. ఇరాన్‌, అమెరికాల మధ్య చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని, మధ్యవర్తుల ద్వారా సందేశాల మార్పిడి కొనసాగుతోందని చెప్పారు.


‘‘ఏడు రోజుల ప్రణాళిక"ను ప్రస్తావిస్తూ టెహ్రాన్ గత నెలలోనే తమ ప్రతిపాదనను సమర్పించిందని, దానిపై అమెరికా అభిప్రాయాలను కూడా స్వీకరించిందని అన్నారు. తాము ప్రస్తుతం అమెరికా అభిప్రాయాలను సమీక్ష‍ిస్తున్నామని, రాబోయే కొద్ది రోజుల్లోనే తమ స్పందనను తెలుపుతామని అన్నారు. అమెరికా ఈ ప్రణాళికను అంగీకరిస్తే, ఆ ఏడు రోజులు రేపటి నుంచే ప్రారంభం కావచ్చని అరాఘ్చి అన్నారు. అవసరమైన చర్యలు ఇప్పటికే ఒక అవగాహన ఒప్పందంలో భాగంగా ఉన్నాయని, వాటిని అమలు చేయడం కష్టం కాదని ఆయన చెప్పారు. అమెరికా షరతులను నెరవేరిస్తే, ఆరవ రోజున హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవవచ్చని, ఆ తర్వాత ఏడవ రోజున ఇరాన్‌, అమెరికాల మధ్య చర్చలు పునఃప్రారంభించవచ్చని ఆయన అన్నారు.


ఇరాన్‌ పై దాడులను పునఃప్రారంభించడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, అయితే, సాధ్యమయ్యే కొత్త దాడులకు సిద్ధంగా ఉండాలని పెంటగాన్‌కు ఆదేశాలు జారీ చేయబడ్డాయని స్థానిక మీడియా ప్రకటించిన సంగతి తెలిసిందే. నవంబర్ 3న జరగనున్న అమెరికా మధ్యంతర ఎన్నికలకు ముందు, అంటే ఒక వారం ముందుగా జరగనున్న ఇజ్రాయెల్ ఎన్నికలకు ముందే దాడులు తిరిగి ప్రారంభం కావచ్చని అమెరికా, ఇజ్రాయెల్ అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు. యుద్ధం తిరిగి ప్రారంభమైతే ఇరాన్ ఇంధన, మౌలిక సదుపాయాలు, అణు లక్ష్యాలపై విస్తృతమైన దాడులు ఉంటాయని మీడియానుద్దేశించి సంబంధిత వర్గాలు తెలిపాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్