Magazines

నేపాల్‌లో ఆకస్మిక వరదలు..చిక్కుకుపోయిన 150 మంది టూరిస్టులు

1 గంట క్రితం

Flash floods in Nepal... 150 tourists stranded
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 12, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : నేపాల్‌లోని మనాస్లు ట్రెకింగ్‌ ప్రాంతంలో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. గోర్ఖా జిల్లాలో బుఢీ గండకి నది ఉప్పొంగడంతో 150 మందికి పైగా విదేశీ పర్యాటకులు, గైడ్‌లు, పోర్టర్లు చిక్కుకుపోయారు. వరదల ధాటికి 40 ఇండ్లు, ఒక పాఠశాల, ఆరు వంతెనలు కొట్టుకుపోయాయి. జగత్‌, లోక్పా, ఛేకాంపార్‌ ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు నేపాల్‌ ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలు చేపట్టింది. కొందరిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు, ఈ వరదల్లో సుమారు 10 మంది స్థానికులు గల్లంతైనట్లు సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్