నవతెలంగాణ - హైదరాబాద్ : జింబాబ్వే మాజీ ఫాస్ట్ బౌలర్, అంతర్జాతీయ అంపైర్ సారా దంబనేవానా (36) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హరారేలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచినట్లు జింబాబ్వే క్రికెట్ ప్రకటించింది. 2009 నుంచి 2014 వరకు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సారా.. అనంతరం అంపైర్‌గా సేవలందించారు. 2024 మహిళల టీ20, 2025 మహిళల వన్డే ప్రపంచకప్‌లలో అంపైరింగ్ చేశారు. 2023 అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు అంపైర్‌గా వ్యవహరించిన తొలి జింబాబ్వే మహిళగా గుర్తింపు పొందారు. ఆమె మరణానికి గల కారణాలు వెల్లడికాలేదు.
జింబాబ్వే మాజీ క్రికెటర్ కన్నుమూత
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 13, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)