నవతెలంగాణ - హైదరాబాద్ : ఐదేళ్ల ప్రేమ.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కానీ వివాహమైన నెల రోజులకే మనస్పర్థలు రావడంతో ఆ జంట జీవితం విషాదంగా ముగిసింది. భార్యాభర్తలు వేర్వేరుగా ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ఎర్రుపాలెంకు చెందిన మహేశ్ (25), ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా బెల్లంకొండవారిపాలెంకు చెందిన వెంకటరమణ (23) ఐదేళ్లుగా ప్రేమించుకున్నారు. నెల రోజుల క్రితం వివాహం చేసుకున్నారు. అయితే కొద్దిరోజులకే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో విడాకులు తీసుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో మనోవేదనకు గురైన వెంకటరమణ తన తాత ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్య మరణవార్త తెలుసుకున్న మహేశ్ రైలు కిందపడి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.
ప్రేమ వివాహం.. నెల రోజులకే విషాదాంతం
6 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 13, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)