Magazines

దీపావళి తర్వాతే ఎండీఆర్‌ ఛార్జీలు

1 గంట క్రితం

MDR charges only after Diwali
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 13, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్‌ : దీపావళి తర్వాతే ఎండీఆర్‌ ఛార్జీలను అమలుచేయనున్నట్లు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా అధికారికంగా వెల్లడించింది. పండగ సీజన్‌లో వ్యాపారాలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే దీనిని వాయిదా వేసినట్లు పేర్కొంది. దీపావళి తర్వాత రూ.2,000 పైబడిన యూపీఐ మర్చంట్ ఛార్జీలను అమలుచేయనున్నట్లు తెలిపింది. యూపీఐ లావాదేవీల ఛార్జీల అమలును వాయిదా వేయాలని వ్యాపారులు చేసిన అభ్యర్థన మేరకు, 'మర్చంట్ డిస్కౌంట్ రేట్' ఛార్జీల అమలును నవంబర్ రెండవ వారానికి వాయిదా వేసినట్లు యన్‌పీసీఐ వివరించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్