Wednesday, October 1, 2025
E-PAPER
Homeజిల్లాలుధాన్యం కొనుగోలు కేంద్రంలో సద్వినియోగం చేసుకోండి

ధాన్యం కొనుగోలు కేంద్రంలో సద్వినియోగం చేసుకోండి

- Advertisement -

ధాన్యం కొనుగోలు కేంద్రంలో సద్వినియోగం చేసుకోండి

తహశీల్దార్ భుజంగరావు

నవతెలంగాణ నసురుల్లాబాద్

ధ్యానం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకో వాలని బీర్కూర్ తహశీల్దార్ భుజంగ రావు తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గంలో ముందస్తు వరి కోతలు ప్రారంభం కావడంతో ప్రతి సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారికంగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. బుధవారం మండలంలోని బైరాపూర్ కిష్టాపూర్, తిమ్మాపూర్, బీర్కూర్, బైరాపూర్, దామరంచ తదితర గ్రామాల్లో ఈ సందర్భంగా తహశీల్దార్ భుజంగరావు మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మకుండా నేరుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలన్నారు.

ప్రభుత్వం క్వింటాలుకు ఏ గ్రేడ్‌ ధాన్యం రూ. 2389, బీ గ్రేడ్‌ ధాన్యం రూ. 2369 రేటును నిర్ణయించిందన్నారు. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకొని నాణ్యతగా కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని అన్నారు. రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని సక్రమంగా కొనుగోలు చేయాలని నిర్వాహకులకు సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఎలాంటి అవకతవకలు జరుగకుండా చూడాలన్నారు. ఎప్పటికప్పుడు కొనుగోలు చేసిన ధాన్యానికి ఓపీఎంఎస్‌ చేసి డబ్బులు వచ్చే విధంగా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఐకెపి ఎంపీఓ శిరీష, రెవెన్యూ ఆర్ఐ విజయ్ కుమార్, బీర్కూర్ సొసైటీ కార్యదర్శి విఠల్, ఐకెపి సిబ్బంది, సొసైటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -