ఎంపీడీవో పెరుమాళ్ళ జ్ఞాన ప్రకాష్ రావు
నవతెలంగాణ – కట్టంగూర్
గ్రామపంచాయతీ వార్డు సభ్యులకు ప్రభుత్వం అందించే శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకోవాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెరుమాళ్ళ జ్ఞాన ప్రకాష్ రావు అన్నారు. వార్డు సభ్యులకు శిక్షణా తరగతులు రెండో విడతలో భాగంగా సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. గ్రామ పరిపాలనలో వార్డు సభ్యులు కీలక పాత్ర పోషిస్తారని, ఈ శిక్షణా తరగతుల ద్వారా సభ్యులకు అవగాహన ఏర్పరచుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి స్వరూపారాణి, పర్యవేక్షకులు చింతమల్ల చలపతి, టివోటీలు వెంకన్న, మల్లేష్, నర్సింహ్మస్వామి సైదులు పది గ్రామాలకు చెందిన వార్డు సభ్యులు ఉన్నారు.
శిక్షణా తరగతులు సద్వినియోగం చేసుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



