Friday, January 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి 

ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి 

- Advertisement -

సబ్ కలెక్టర్ కిరణ్మయి 
నవతెలంగాణ – బాన్సువాడ (నసురుల్లాబాద్)

పదో తరగతి విద్యార్థులు పరీక్షలంటే భయపడాల్సిన అవసరం లేదని, చదివిన విషయాలను ఆత్మవిశ్వాసంతో రాయాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి అన్నారు. శుక్రవారం బాన్సువాడ పట్టణంలో రెడ్డి సంఘంలో ప్రభుత్వ హాస్టళ్లకు చెందిన పదో తరగతి ఎస్సీ, ఎస్టీ, బీ.సి. విద్యార్థులకు స్పూర్తి, ప్రేరణ, పునఃశ్చరణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడారు. విద్యార్థులు పరీక్షలంటే భయపడొద్దని, మానసికంగా సిద్ధంగా ఉండాలన్నారు. ఇష్టంతో చదివితే ఏ పరీక్షలో అయినా మంచి మార్కులు సాధించవచ్చని తెలిపారు. విద్యార్థులందరూ బోర్డు పరీక్షల్లో పదికి పది జీపీఏ సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాధించుట కొరకు తీసుకోవాల్సిన సలహాలు, సూచనలను, మెలకువలను వివరించారు. ప్రతిరోజు ఒక సబ్జెక్టును ఎంపిక చేసుకుని చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ సంక్షేమ హాస్టల్లో నిర్వాహకులు విజయ భారతి , గంగా విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -