– ముఖ్యమంత్రి రేవంత్‌కు శాంతిచర్చల కమిటీ నేతల వినతి
– మంత్రులతో చర్చిస్తా : సీఎం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని శాంతి చర్చల కమిటీ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో గల సీఎం నివాసంలో ఆయన్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని కోరారు. ”నక్సలిజాన్ని మా ప్రభుత్వం శాంతి భద్రతల అంశంగా చూడటం లేదు. సామాజిక కోణంలో మాత్రమే చూస్తోంది. గతంలో నక్సలైట్లతో చర్చలు జరిపిన అనుభవం సీనియర్ నేత జానారెడ్డికి ఉంది. ఈ అంశంపై సీనియర్ నేతలు, మంత్రులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటాం” అని వారికి సీఎం హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిన కలిసిన వారిలో శాంతి చర్చల కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, దుర్గాప్రసాద్, జంపన్న, రవి చందర్ తదితరులు ఉన్నారు.
మావోయిస్టులతోకేంద్రం చర్చలు జరిపేలా చొరవ తీసుకోండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES