నవతెలంగాణ – ఊరుకొండ
అర్ధాంతరంగా మృతి చెందిన బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు తన వంతు సహాయ సహకారాలు అందించి అండగా నిలిచిన జననేత, జకినాలపల్లి మాజీ సర్పంచ్ తలసాని అనిల్ రెడ్డి అని కాంగ్రెస్ నాయకులు అన్నారు. శుక్రవారం ఊరుకొండ మండలంలోని రాచాలపల్లి గ్రామానికి చెందిన చింతకింది రాములు(55) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతు మృతి చెందారు. స్థానిక కాంగ్రెస్ నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న జననేత, జకినాలపల్లి మాజీ సర్పంచ్ తలసాని అనిల్ రెడ్డి మృతుని కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ తక్షణ సహాయం కింద స్థానిక కాంగ్రెస్ నాయకుల ద్వారా మృతుని కుమారుడు నరేష్ కు 5వేల ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు నరసింహ, నరేష్ యాదవ్, భూపాలు, బాల్ రాజు, కృష్ణ, పర్వతాలు, పలువురు గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
అభాగ్యులకు అండగా తలసాని అనిల్ రెడ్డి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES