నవతెలంగాణ – మిర్యాలగూడ
ఇటీవల దేవరకొండలో జరిగిన ఆయుష్ కరాటే అకాడమీ నిర్వహించిన కరాటే పోటీలో మిర్యాలగూడలోని శాస్త్ర స్కూల్ విద్యార్థులు పోటీలో ప్రతిభ కనబర్చారు. ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో పథకాలు సాధించారు. అపర్ణ బ్లూ బెల్ట్ కేటగిరీలో కటాస్ విభాగంలో ప్రథమ స్థానం గోల్డ్ మెడల్, ఆనంద రూప ఆరంజ్ బె ల్ట్ కేటగిరిలో కట స్ భాగంలో ప్రథమ స్థానం గోల్డ్ మెడల్, స్నేహ ఎల్లో బెల్ట్ కేటగిరి కటాస్ విభాగంలో ప్రథమ స్థానం గోల్డ్ మెడల్, అభిరామ్ ఎల్లో బెల్ట్ కేటగిరి లో కటాస్ భాగంలో ప్రథమ స్థానం గోల్డ్ మెడల్, లత్యశ్రీ వైట్ బెల్ట్ కేటగిరీలో కటాస్ విభాగంలో ద్వితీయ స్థానం సిల్వర్ మెడల్, శ్రీ సంయుక్త ఎల్లో బెల్ట్ కేటగిరిలో కట స్ భాగంలో తృతీయ స్థానం బ్రాంచ్ మెడల్, రిషి వైట్ బెల్ట్ కేటగిరీలో కటాస్ భాగంలో తృతీయ స్థానం బ్రౌన్ మెడల్ సాధించినట్లు స్కూల్ చైర్మన్ చంద్రశేఖర్, కరస్పాండెంట్ పి శ్రీధర్ రెడ్డి, ప్రిన్సిపాల్ పి సింధు రెడ్డి లు తెలిపారు. వీటితో పాటు విద్యార్ధులను కరాటే మాస్టర్ రామకృష్ణ నాయక్, పి ఈ టి జగన్, అమృత, గౌతమిలు అభినందించారు.
జాతీయ స్థాయి కరాటే పోటీల్లో శాస్త్ర స్కూల్ విద్యార్థుల ప్రతిభ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



