– కోడిరామకృష్ణ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో ఘనంగా సత్కారం
నవతెలంగాణ హైదరాబాద్: తెలుగు సినీ రంగంలో తనదైన శైలిలో కథలు చెప్పే ప్రయత్నంలో ఉన్న యువ దర్శకుడు తల్లాడ సాయి కృష్ణ తాజాగా మరో గౌరవాన్ని తన ఖాతాలోకి వేసుకున్నారు. కోడిరామకృష్ణ గారి పేరిట ప్రతి ఏటా నిర్వహించే ప్రతిష్టాత్మక “కోడిరామకృష్ణ ఫిల్మ్ అవార్డ్స్ 2025” కార్యక్రమంలో ఆయనకు “యువ ప్రతిభ డైరెక్టర్ అవార్డు” ప్రదానం చేయడం జరిగింది.
ఈ అవార్డు, ఆయన కథ రచన, దిశానిర్దేశం, స్క్రీన్‌ప్లే రంగాల్లో చూపించిన సృజనాత్మకతకు గుర్తింపుగా లభించింది. ఇటీవల ఆయన రూపొందించిన నమస్తే సేట్ జీ, దక్ష, మిస్టరీ సినిమాలకి మంచి స్పందన లభించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డు ద్వారా యువ దర్శకులలో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన కోడిరామకృష్ణ ఫిల్మ్ ఫౌండేషన్‌కు, తుమ్మలపల్లి రామసత్య నారాయణకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరో సుమన్, డైరెక్టర్ రేలంగి, నీహారిక కొణిదెల పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ –
“ఇది కేవలం ఒక అవార్డు కాదు, నా మీద ఉన్న నమ్మకానికి గుర్తింపు. తెలుగు సినిమా కోసం ఇంకా ఎన్నో వినూత్న ప్రయోగాలు చేయాలని ఉంది. నా టీమ్, నటీనటులు, టెక్నీషియన్లు, ప్రేక్షకులందరికీ ఇది అంకితం.” అని తెలిపారు.