Monday, January 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్టాప్రా నూతన క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ..

టాప్రా నూతన క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
టాప్రా నూతన సంవత్సర 2026 క్యాలెండర్, డైరీ ని జిల్లా కోశాధికారి కార్యాలయంలో జిల్లా కోశాధికారి సంపూర్ణ, అసిస్టెంట్ ట్రెజరరీ ఆఫీసర్ మోహన్ కుమార్ తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొమ్మకంటి బాలరాజు, ప్రధాన కార్యదర్శి కడారు రమేష్ బాబు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి ,విశ్రాంత ఉద్యోగుల సమస్యలను  త్వరితరగతిన పరిష్కరించగలడాని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం బకాయిలను మెడికల్ బిల్లులను చాలా ఆలస్యంగా కొన్ని కొన్ని మాత్రమే విడుదల అవుతున్నందున మంజూరైన వాటిని పరిష్కరించి, పెన్షనర్లకు సహాయ పడగలరని, నూతన సంవత్సరంలో మా సమస్యలను పరిష్కరిస్తారని కోరారు.

ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ఉప కోశాధికారులు ప్రతిమ, వాజిద్‌, శ్రవణ్ కుమార్ & ,కార్యాలయ సిబ్బంది జీవన్, సత్యనారాయణ తో పాటు సంఘ జిల్లా కమిటీ గౌరవాధ్యక్షులు దాసరి అంజయ్య , జిల్లా కమిటీ సభ్యులు జిట్టా భాస్కర్‌ రెడ్డి, గోపరాజు లక్ష్మీనారాయణ ,రామ నరసయ్య, కోశాధికారి యామగాని బుగ్గయ్య, సోమయ్య,  అంజయ్య, అంబెడ్కర్, శంకరడ్డి, సుధాకర్ రెడ్డి , మాటూరిబాలేశ్వర్, ఉపాధ్యక్షురాలు శకుంతల, బిక్షపతి, మొగుల్లా సుధాకర్ రెడ్డి లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -