నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరిలోని తెలంగాణ హోటల్ కన్వెన్షన్ హాల్లో కడారు రమేష్ బాబు అధ్యక్షతన కాప్రా సంఘ సమావేశం నిర్వహించారు. ఈ కార్యవర్గ సమావేశానికి ఆ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలకుర్తి కృష్ణమూర్తి ముఖ్య అతిధిగా హాజరై, మాట్లాడారు. సంఘం స్వతంత్రంగా పెన్టనర్ల జేఏసీ లో భాగస్వామ్యంగా ఎన్నో ఉద్యమాలు చేస్తూ ,పెన్షనర్ల సమస్యల కోసం నిరంతర పోరాటం చేస్తుందని, ఇంకా అపరిస్కృతంగా ఉన్న సమస్యల సాధన కోసం ఉద్యమించాలని, సమావేశంలో తెలియజేశారు .ప్రతి సభ్యుడు కార్యకర్తగా ఎదిగి సంఘటితంగా ఉద్యమాల్లో పాల్గొని సమస్యల సాధనకు తోడ్పడాలని పెన్షనర్లకు విజ్ఞప్తి చేశారు.
పెన్షనర్ల హెల్త్ కార్డు సమస్యలను ప్రభుత్వం త్వరలో పరిష్కరిస్తుందని, రియింబుర్సు్మెంట్ బకాయిలు కొద్ది మొత్తంలో విడుదల చేయడం జరిగిందని తెలియజేశారు. ఈసా సమావేశంలో ఈ క్రింది తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించనైనది .1.పదవి విరమణ పొందిన పెన్షనర్లకు రావాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని 2.పి.ఆర్.సిని వెంటనే ప్రభుత్వం అమలు చేయాలని ,,3. పెండింగ్లో ఉన్న ఐదు డిఏలను పెన్షనర్లకు మంజూరు చేయాలని, 4. మెడికల్ ఖర్చుల నిమిత్తం ఇస్తున్న రూ.6000 రెండు వేల రూపాయల వరకు పెంచాలని తీర్మానించడమైనది .ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో పెన్షనర్ భవనాలు ప్రభుత్వమే నిర్మించి,&వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేయాలని తీర్మానించనైనది. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మకంటి బాలరాజు,, రాష్ట్ర కమిటీ సభ్యులు జిట్ట భాస్కర్ రెడ్డి ,జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం .బాలేశ్వర్ , జి జగన్మోహన్ ,బిక్షపతి ,అంబేద్కర్, రామనర్సయ్య, యామగాన్ని బుగ్గయ్య , శకుంతల, దాసరి అంజయ్య లు పాల్గొన్నారు.
టాప్రా సంఘ కార్యవర్గ సమావేశం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES