Sunday, February 15, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయం53 దేశాలపై సుంకాలు రద్దు

53 దేశాలపై సుంకాలు రద్దు

- Advertisement -

ఆఫ్రికన్‌ దేశాలకు చైనా బాసట
మే 1 నుంచి అమల్లోకి..
ట్రంప్‌ టారిఫ్‌లకు భిన్నంగా జిన్‌పింగ్‌ ముందడుగు

బీజింగ్‌: అమెరికా అధినేత డోనాల్డ్‌ ట్రంప్‌ టారిఫ్‌లతో దడపుట్టిస్తుంటే… చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ అందుకు భిన్నంగా దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక బంధాలను మరింత బలోపేతం చేసుకుంటున్నారు. తాజాగా చైనా, ఆఫ్రికన్‌ ఖండం మధ్య ఆర్థిక సంబంధాలను మరింతగా పెంచుకునే లక్ష్యంతో కీలక ముందడుగు వేశారు. మే 1 నుంచి దాదాపు అన్ని ఆఫ్రికన్‌ దేశాల వస్తువులపై దిగుమతి సుంకాలను బీజింగ్‌ తొలగిస్తుందని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ప్రకటించారు. ఈ వారాంతంలో ఆఫ్రికన్‌ యూనియన్‌ శిఖరాగ్ర సమావేశానికి ఆఫ్రికన్‌ నాయకులు సమావేశమైన తరుణంలో ఈ నిర్ణయం బహిరంగంగా ప్రకటించబడింది. సవరించిన విధానం ప్రకారం… తైవాన్‌ ప్రభుత్వాన్ని ఇప్పటికీ గుర్తించే ఏకైక ఆఫ్రికన్‌ దేశం ఎస్వాటినిని మినహాయించి, చైనా అధికారిక దౌత్య సంబంధాలను కొనసాగిస్తున్న 53 ఆఫ్రికన్‌ దేశాల నుంచి దిగుమతులకు సున్నా సుంకం అమల్లోకి రానున్నది. గతంలో 33 ఆఫ్రికన్‌ దేశాలకు సున్నా-సుంకం ఒప్పందం అమలులో ఉంది. వాణిజ్యం, సహకారాన్ని సులభతరం చేయడంలో బీజింగ్‌ నిబద్ధతను నొక్కి చెబుతూ… సుంకాల తగ్గింపును ”నిస్సందేహంగా ఆఫ్రికన్‌ అభివృద్ధికి కొత్త అవకాశాలను అందించే” ఒక అడుగుగా జిన్‌పింగ్‌ అభివర్ణించారు. దక్షిణ ఆర్థిక సహకారాన్ని ప్రోత్సహించడానికి, ఆఫ్రికన్‌ ఆర్థిక వ్యవస్థల పారిశ్రామిక, ఎగుమతి సామర్థ్యాలకు మద్దతు ఇవ్వడానికి చైనా విస్తృత వ్యూహంలో భాగంగా ఆయన ఈ చర్యను రూపొందించారు.మారుతున్న ప్రపంచ వాణిజ్య సమీకరణాల నడుమ బీజింగ్‌ నుంచి ఈ నిర్ణయం వచ్చింది. ఇటీవలి సంవత్సరాలలో అమెరికా వంటి దేశాలు అనేక ప్రాంతాల నుంచి దిగుమతులపై సుంకాలను పెంచడంతో, అనేక ఆఫ్రికన్‌ ప్రభుత్వాలు ఎగుమతి మార్కెట్లను వైవిధ్యపరచడానికి, పాశ్చాత్య మార్కెట్లపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో చైనా ప్రకటనను దౌత్య వర్గాలు విస్తృతంగా స్వాగతించాయి. సుంకాలను రద్దు చేయడంతో పాటు, ఆఫ్రికన్‌ ప్రభుత్వాలతో ఉమ్మడి ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాలను కొనసాగించాలని చైనా అధికారులు యోచిస్తున్నట్టు చెప్పారు. కస్టమ్స్‌ క్లియరెన్స్‌ కోసం మెరుగైన ”గ్రీన్‌ ఛానల్‌” వంటి చర్యలు వాణిజ్య ప్రవాహాలను వేగవంతం చేయడానికి, సుంకం లేని అడ్డంకులను తగ్గించడానికి తోడ్పడనున్నది. వ్యవసాయ ఉత్పత్తులు, ఖనిజాలు, తయారీ వస్తువుల ఎగుమతిదారులు చైనా మార్కెట్‌లోకి ప్రవేశించడాన్ని సులభతరం చేస్తాయని అంతర్జాతీయ వాణిజ్య నిపుణులు వెల్లడిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -