- Advertisement -
నవతెలంగాణ – బెజ్జంకి
టాటా ఏఐఏ జీవిత భీమా రంగంలో రాష్ట్రస్థాయి ఉత్తమ పురస్కారాన్ని మండల కేంద్రానికి చెందిన బోనగిరి ప్రభాకర్ అందుకున్నాడు. గురువారం సికింద్రాబాద్ మారియట్ హోటల్ యందు నిర్వహించిన టాటా ఏఐఏ కార్యక్రమంలో రీజీయన్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి లియో గ్రిఫిన్ సమక్షంలో బిసినెస్ అసోసియేట్ చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ అమిత్ దావే రాష్ట్రస్థాయి వాణిజ్య ఉత్తమ పురస్కారం ప్రభాకర్ కు అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ హెడ్ యారాడ భరణి, క్లస్టర్ హెడ్ రాము సుర, బ్రాంచ్ మేనేజర్ శ్రవణ్, పార్టనర్ శ్రీధర్ మల్యాల, సీబీఏ కందికంటి విజయ్ కుమార్, బీఏఎం నవీన్ అభినందించినట్టు పురస్కార గ్రహీత ప్రభాకర్ శుక్రవారం తెలిపారు
- Advertisement -