Saturday, December 27, 2025
E-PAPER
Homeబీజినెస్టాటా స్టీల్‌పై రూ.14,366 కోట్లకు దావా

టాటా స్టీల్‌పై రూ.14,366 కోట్లకు దావా

- Advertisement -

డచ్‌ ఎన్‌జీఓ న్యాయపోరాటం
న్యూఢిల్లీ :
టాటా గ్రూప్‌నకు చెందిన టాటా స్టీల్‌ నెదర్లాండ్‌ యూనిట్‌పై డచ్‌కు చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ కేసు వేసింది. నెదర్లాండ్స్‌లోని ఆ కంపెనీ కార్యకలాపాల కారణంగా స్థానికుల ఆరోగ్యంపై చెడు ప్రభావం, పర్యావరణ పరంగానూ నష్టం వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీనికి పరిహారంగా 1.6 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.14,366 కోట్లు) చెల్లించాలని హోర్లెంలోని నార్త్‌ హోలెండ్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టులో ఎన్‌జీఓ కేసు వేసింది. ఈ విషయాన్ని టాటా స్టీల్‌ శుక్రవారం దృవీకరించింది. నెదర్లాండ్స్‌లోని వెల్సన్‌ నూర్డ్‌లో నిర్వహిస్తున్న టాటా స్టీల్‌ ఐజ్మెయిడన్‌ బివి నుంచి వెలువడే కాలుష్యకారకాల వల్ల స్థానికులు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని ఆ ఎన్‌జీఓ కేసులో పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -