Friday, March 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఓఆర్‌ఎస్‌ఎల్‌, ఈఆర్‌జెడ్‌ఎల్‌పై డాక్టర్‌ శివరంజని పోరాటానికి టీడీఎఫ్‌ మద్దతు

ఓఆర్‌ఎస్‌ఎల్‌, ఈఆర్‌జెడ్‌ఎల్‌పై డాక్టర్‌ శివరంజని పోరాటానికి టీడీఎఫ్‌ మద్దతు

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ప్రజారోగ్యంలో భాగంగా ఓఆర్‌ఎస్‌ఎల్‌, ఈఆర్‌జెడ్‌ఎల్‌పై డాక్టర్‌ శివరంజని చేస్తున్న పోరాటానికి తెలంగాణ వైద్యుల సమాఖ్య(టీడీఎఫ్‌) మద్దతు తెలిపింది. గురువారం హైదరాబాద్‌లో డాక్టర్‌ శివరంజనితో టీడీఎఫ్‌ బృందం సమావేశమైంది. అందులో టీడీఎఫ్‌ అధ్యక్షులు డాక్టర్‌ విజయేందర్‌, కార్యదర్శి డాక్టర్‌ నిదావుల్లా, కోశాధికారి డాక్టర్‌ ప్రదీప్‌, నాయకులు డాక్టర్‌ రమ, డాక్టర్‌ కళ్యాణ్‌, డాక్టర్‌ నిఖిల్‌, డాక్టర్‌ దినేశ్‌, తదితరులున్నారు. ఆరోగ్య సంరక్షణ అందించడంలో పారదర్శకతను నిర్ధారించడం, వైద్యపరమైన స్వయంప్రతిపత్తిని పరిరక్షించడం, నాణ్యతా ప్రమాణాలను పాటించడంపై వారు చర్చించారు. వైద్యుల, రోగుల ప్రయోజనాలను రక్షించేందుకు జరుగుతున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -