ఉపాధ్యాయులకు సన్మానం
నవతెలంగాణ-పాలకుర్తి
సమాజ దిక్సూచి ఉపాధ్యాయులేనని తహసీల్దార్ నాగేశ్వర చారి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయం తో పాటు పాలకుర్తి ఉన్నత పాఠశాల, లక్ష్మీనారాయణ పురం, చెన్నూరు పాఠశాలల్లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సన్మాన కార్యక్రమానికి ఎంపీడీవో రవీందర్, మండల విద్యాశాఖ అధికారి పోతుగంటి నర్సయ్య లతో కలిసి ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులు నిత్య విద్యార్థులేనని కొనియాడారు. విద్యార్థినీ, విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర గొప్పదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు శ్రమించాలని, ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా విద్యాబోధనను అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఓరుగంటి రమేష్, వెంకటయ్య. శైలజ, అంజయ్య, వెంకటేశ్వర్లు, దేవేందర్, తండ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
సమాజ దిక్సూచి ఉపాధ్యాయులే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES