Tuesday, August 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి..

ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి..

- Advertisement -

యు ఎస్ పి సి ఆధ్వర్యంలో జరిగిన కలెక్టరేట్ ధర్నా లో యు ఎస్ పి సి రాష్ట్ర నాయకులు..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్

తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగంలో దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘాల నాయకులు మాట్లాడుతూ ఉపాధ్యాయుల పదోన్నతులను పారదర్శకంగా పూర్తి చేయాలని కోరారు. జీవో నెంబర్ 25 ను సవరించి కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేలా 40 మంది విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాలలకు తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండే విధంగా, ఉన్నత పాఠశాలలో సబ్జెక్టు వర్క్ లోడ్ కనుగుణంగా టీచర్ పోస్టులు కేటాయించాలని అన్నారు.

అన్ని రకాల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, రిటైర్డ్ ఉపాధ్యాయుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలని అన్నారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాలని ,సిపిఎస్ రద్దుచేసి ఓ పి ఎస్ ను పునరుద్ధరించాలని తెలిపారు. ఏకీకృత సర్వీసు రూల్స్ రూపొందించి పర్యవేక్షణాధికారి పోస్టులను భర్తీ చేయాలని అన్నారు. ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల పోస్టులను మంజూరు చేసి బీఈడీ, డిఈడి అర్హతలు ఉన్న సీనియర్ ఎస్ జి టి లందరికీ ప్రమోషన్ అవకాశం కల్పించాలని, అప్ గ్రేడేషన్ ప్రక్రియ పూర్తయినందున జీవో 2 ,3 ,9, 10 లను రద్దుచేసి జీవో 11, 12 ల ప్రకారం ఎస్ జి టి ,లాంగ్వేజ్ పండిట్స్, పీఈటీలకు పదోన్నతులు కల్పించాలని ,సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె కాలపు జీతాన్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

కేజీబీవీ, యుఆర్ఎస్ ,సమగ్ర శిక్ష ,కాంట్రాక్టు ఉద్యోగులకు బేసిక్ పే అమలు చేయాలని, మోడల్ స్కూల్స్, గురుకుల సిబ్బందికి 010 ద్వారా వేతనాలు చెల్లించాలని ,హెల్త్ కార్డు ఇవ్వాలని ,పిఆర్సి నివేదికను వెంటనే తెప్పించుకొని జూలై 2023 నుండి అమలు చేయాలని, జీవో 317 కారణంగా స్థానికతను కోల్పోయిన ఉపాధ్యాయులను వారి స్థానిక జిల్లాలకు బదిలీ చేయాలని ,డీఎస్సీ 2008 కాంట్రాక్టు టీచర్లకు ఉద్యోగ భద్రత కల్పించి, 12 నెలల వేతనాలు చెల్లించాలని వర్తింపచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ నాయకులు సిహెచ్ రాములు టీఎస్ యుటిఎఫ్,ఎం కృష్ణారెడ్డి (టి పి టి ఎఫ్), సిహెచ్ వెంకటేశ్వర్లు( డిటిఎఫ్), నామ నాగయ్య ఎస్సీ ఎస్టీ యూఎస్,యుఎస్పిసి నాయకులు ఎన్ సోమయ్య, ఆర్ రామ నరసయ్య, పి వెంకటేశ్వర్లు, కే ఉపేందర్, ఎస్ అనిల్ కుమార్, పి వీరన్న, ఆర్ లింగయ్య, పి శ్రీనివాస్ రెడ్డి, రామకృష్ణ, పి అభినవ్, పి వెంకన్న, డి యాదగిరి, బి ఆనంద్, కె వెంకటేశ్వర్లు,తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -