Thursday, August 7, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంఉపాధ్యాయులను కేటాయించాలి

ఉపాధ్యాయులను కేటాయించాలి

- Advertisement -

– బడికి తాళం వేసి విద్యార్థుల నిరసన
నవతెలంగాణ-కుభీర్‌

తమకు పాఠాలు బోధించేందుకు ఉపాధ్యాయులను కేటాయించాలంటూ విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి బడికి తాళం వేసి నిరసన తెలిపారు. ఈ ఘటన నిర్మల్‌ జిల్లా కుభీర్‌ మండలం సాంగ్వి గ్రామంలో బుధవారం జరిగింది. బడిలో పాఠాలు బోధించే ఉపాధ్యాయులు లేకపోవడంతో మెరగైన విద్యాబోధన అందడం లేదని, 55 మంది విద్యార్థులకు ఒక్కరే ఉపాధ్యాయులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతకాలంగా ఇద్దరు విద్యావాలంటీర్లను నియమించి వారికి గౌరవవేతనం తామే చెల్లిస్తున్నామని, దీంతో తమపై ఆర్థికభారం పడుతోందని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే ఉపాధ్యాయులను నియమిం చాలని కోరారు. ఈ విషయంపై మండల విద్యాధికారి విజరు కుమార్‌ను వివరణ కోరగా.. పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉండగా అందులో నుంచి ఒక్క ఉపాధ్యాయురాలు మెటర్నీటి సెలవులో ఉన్నారని తెలియ జేశారు. ప్రస్తుతం ఒక్కరే విధులు నిర్వర్తిస్తున్నారని, విద్యార్థుల సమస్యను దృష్టిలో పెట్టుకుని పైఅధికారులకు తెలియజేస్తామని, సాధ్యమైనంత వరకు ఉపాధ్యాయుడిని నియమించేలా చూస్తామని చెప్పారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img