నవతెలంగాణ – హైదరాబాద్ : గువాహటి వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. 9/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు తన ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన టీమ్‌ఇండియా 6 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. టీమ్ ఇండియా ఇంకా 387 పరుగుల వెనుకంజలో ఉంది. ప్రస్తుతం క్రీజులో సుందర్ (0*), రవీంద్ర జడేజా (3*) ఉన్నారు. క్రీజులో కుదురుకుంటున్న సమయంలో కేఎల్ రాహుల్ (22; 63 బంతుల్లో, 2 ఫోర్లు ).. కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో (21.3) స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ఐడెన్ మార్‌క్రమ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 63 పరుగుల వద్ద టీమ్ ఇండియా మొదటి వికెట్‌ను కోల్పోయింది. జైస్వాల్ 85 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే కాసేపటికి యశస్వి జైస్వాల్ (58; 97 బంతుల్లో, 7 ఫోర్లు, 1 సిక్స్) సైమన్ ఆర్మర్ బౌలింగ్‌లో మార్కో యాన్సెన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 95 పరుగుల వద్ద భారత జట్టు తన రెండో వికెట్‌ను కోల్పోయింది. తర్వాత కాసేపటికే సాయిసుదర్శన్ (15), ధ్రువ్ జురేల్, పంత్ (7), నితీష్ కుమార్(10) కూడా వెనుదిరిగాడు. దీంతో టీమ్‌ఇండియా 119 పరుగుల వద్ద 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
పీకల్లోతు కష్టాల్లో టీమ్‌ఇండియా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


