800కు పైగా విమానాల రాకపోకలకు అంతరాయం
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం సాంకేతిక సమస్య తలెత్తింది. ఎయిర్‌పోర్టులోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సాంకేతికలోపం తలెత్తడంతో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. దీని కారణంగా దాదాపు 800కుపైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు అధికారులు తెలిపారు. దేశంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో ఒకటైన ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రోజుకు 1500కు పైగా విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి.
అసౌకర్యానికి చింతిస్తున్నాం
”ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) వ్యవస్థలో సాంకేతిక సమస్య కారణంగా ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు ఆలస్యం అవుతున్నాయి. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించేందుకు సాంకేతిక సిబ్బంది వారి భాగస్వాములతో కలిసి చురుకుగా పనిచేస్తున్నారు. దీంతో విమాన రాకపోకలు ఆలస్యం అవుతున్నాయి. తాజా అప్డేట్‌ల కోసం ప్రయాణికులు తమ విమానయాన సంస్థలతో టచ్‌లో ఉండాలి. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి మేము హృదయపూర్వకంగా చింతిస్తున్నాము.”అని ఢిల్లీ విమానాశ్రయం ఎక్స్ పోస్టులో పేర్కొంది.
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సాంకేతిక సమస్య
- Advertisement -
- Advertisement -


