Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుమీసేవా కేంద్రాలను తనిఖీ చేసిన తహసీల్దార్

మీసేవా కేంద్రాలను తనిఖీ చేసిన తహసీల్దార్

- Advertisement -

నవతెలంగాణ – రెంజల్  : మీసేవ కేంద్రాల ద్వారా రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకునే వారి నుంచి సుమారు రూ.3000 వరకు అదనంగా వసూలు చేస్తున్నారని తహసీల్దార్ దృష్టికి వచ్చింది. దీంతో వెంటనే స్పందించిన ఆయన మండలంలోని మీసేవ కేంద్రాలను శనివారం సాయంత్రం తహసిల్దార్ శ్రావణ్ కుమార్ ఆస్మిక తనిఖీలను చేపట్టారు. ఇందులో భాగంగా నిర్వాహకులు, మధ్యవర్తుల ద్వారా రేషన్ కార్డులను ఇప్పిస్తామంటూ అదనపు డబ్బులు వసూలు చేయడం జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకునే లబ్ధిదారులు కేవలం రూ.45 మాత్రమే మీ సేవ నిర్వాహకులకు చెల్లించి దరఖాస్తులు చేసుకోవాలన్నారు. దరఖాస్తులకు చివరి తేదీ అంటూ ఏది ప్రభుత్వం ఇంతవరకు నిర్ణయించలేదని ఆయన స్పష్టం చేశారు. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు పూర్తి వివరాలను తమ వద్ద నుంచి తీసుకొని దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. నిర్వాహకులు ప్రజల నుంచి అదనపు వసూళ్లు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్బంగా ఆయన హెచ్చరించారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img