ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి మండల ఉద్యమకారుల ఫోరం అధ్యక్షులు హనుమాన్లు
నవతెలంగాణ – మద్నూర్
తెలంగాణ ఉద్యమకారుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం రాహుల్ గాంధీకి మద్నూర్ మండలం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పోస్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మద్నూర్ మండల తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అధక్షులు తూమ్ హనుమాన్లు మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేస్తామని ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చే విధంగా రాహుల్ గాంధీ ప్రత్యేకంగా చొరవచూపి సహకరించాలని పోస్ట్ కార్డుల ద్వారా విన్నవించినట్లు ఆయన తెలిపారు. కొన్ని డిమాండ్లను పోస్ట్ కార్డులో రాహుల్ గాంధీకి తెలియజేసినట్లు ఆయన విలేకరులకు తెలిపారు. ఈ పోస్ట్ కార్డు ఉద్యమ కార్యక్రమంలో అంజయ్య ,గంగారాం ,శివరాం, విట్టల్, పాల్గొన్నారు.
రాహుల్ గాంధీకి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పోస్టు కార్డులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES