- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గ సమావేశం ముగిసింది. సుమారు 1 గంటలకు పైగా నిర్వహించిన క్యాబినెట్ భేటీలో విద్యుత్ శాఖకు సంబంధించిన ప్రధాన అంశాలపై చర్చించారు. రామగుండంలో థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణంపై చర్చించినట్లు తెలుస్తోంది. సోలార్ పవర్‌ను రాష్ట్రంలో ఎక్కువగా వినియోగించే విధంగా చర్యలు తీసుకోవాలని క్యాబినెట్ నిర్ణయించినట్లు సమాచారం. మరికాసేపట్లో మంత్రులు మీడియా సమావేశం నిర్వహించి క్యాబినెట్ నిర్ణయాలను వెల్లడించనున్నారు.
- Advertisement -



