నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ క్యాబినెట్ సమావేశం వాయిదా పడింది. నేడు సచివాలయంలో జరగాల్సిన క్యాబినెట్ భేటీని సోమవారానికి వాయిదా వేసినట్లు అధికారవర్గాలు తెలిపాయి. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు మంత్రివర్గం సమావేశం జరగాల్సి ఉంది. అయితే, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. అదేవిధంగా, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి వీరంతా ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న ఏఐసీసీ సమావేశంలో పాల్గొంటున్నారు. ఐదు మంది మంత్రులు ఢిల్లీలోనే ఉండవం వలన క్యాబినెట్ సమావేశం వాయిదా వేయాలని సీఎం రేవంత్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశాన్ని సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించాలని సీఎం సూచించినట్లు సమాచారం.
తెలంగాణ క్యాబినెట్ భేటీ వాయిదా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES