Tuesday, August 5, 2025
E-PAPER
Homeతాజా వార్తలునేడు తెలంగాణ క్యాబినెట్ సమావేశం..

నేడు తెలంగాణ క్యాబినెట్ సమావేశం..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు సెక్రటేరియట్‌లో మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, సీఎస్ రామకృష్ణా రావు, ప్రభుత్వ సలహాదారులు హాజరుకానున్నారు. అయితే, ఈ భేటీలో చర్చించాల్సిన పలు అంశాలపై ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ప్రభుత్వ కార్యదర్శులు అజెండా అంశాలను సాధారణ పరిపాలన విభాగానికి (GAD)కి పంపాలని నాలుగు రోజుల క్రితమే సీఎస్ అన్ని శాఖలకు సర్క్యూలర్ జారీ చేశారు. ఇందులో భాగంగా ప్రధానంగా కులగణన నివేదికపై చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. ‘బీసీ’ ఆర్డినెన్స్‌ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ న్యాయ సలహా కొసం ఢిల్లీలోని అటార్నీ జనరల్ పంపిన నేపథ్యంలో ఆ తర్వాత తలెత్తబోయే పరిస్థితులు, పరిణామాలపై చ‌ర్చించ‌నున్నారు.

గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ బిల్లు, గోశాల విధానంపై కూడా చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో నూతన ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు అవసరమైన పోస్టుల మంజూరుకు మంత్రి మండలి ఆమోదం తెలుపనుంది. మత్స్యకార సహకార సంఘాల ఇంచార్జీల నియామకంపై నిర్ణయం తీసుకోనున్నారు. వర్షాకాలం పంట సాగు ప్రారంభమైన నేపథ్యంలో యూరియా లభ్యత, డిమాండ్‌ను మంత్రివర్గం సమీక్షించనుంది. ఆయా జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల పురోగతి.. నిధులు సమకూర్చడంపై క్యాబినెట్ చర్చించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇవాళ జస్టిస్ పీ.చంద్రఘోష్ కమిషన్‌ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అవకాశం ఉండటంతో ఆ నివేదికతో పాటు విద్యుత్‌ సంస్థల్లో జరిగిన అక్రమాలపై అందిన రిపోర్టుపై కూడా ఆరా తీయనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -