నేడు తెలంగాణ క్యాబినేట్ సమావేశం

నవతెలంగాణ – హైదరాబాద్‌: కొత్త సచివాలయంలో తొలిసారిగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగనుంది. సీఎం కే. చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో మంత్రులతోపాటు అధికారులు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలపై చర్చించడంతోపాటు పలు కీలక అంశాలపై మంత్రివర్గం నిర్ణయాలు తీసుకోనున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. జూన్‌ 2 నుంచి 21 రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

Spread the love