Sunday, January 11, 2026
E-PAPER
Homeబీజినెస్పదేండ్లలో తెలంగాణలో 13 శాతం వృద్ధి

పదేండ్లలో తెలంగాణలో 13 శాతం వృద్ధి

- Advertisement -

బ్రిక్‌వర్క్‌ రేటింగ్స్‌ అంచనా

నవతెలంగాణ – హైదరాబాద్‌
తెలంగాణ రాష్ట్రం మెరుగైన వృద్ధి రేటును నమోదు చేస్తోందని బ్రిక్‌వర్క్‌ రేటింగ్స్‌ తెలిపింది. 2025 నుంచి 2034 మధ్య వార్షిక సగటు వృద్ధి 12-13 శాతంగా ఉండొచ్చని ఈ స్వదేశీ క్రెడిట్‌ రేటింగ్‌ ఎజెన్సీ విశ్లేషించింది. మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బ్రిక్‌వర్క్‌ రేటింగ్స్‌ సీఈఓ మను సెహగల్‌, చీఫ్‌ రేటింగ్‌ ఆఫీసర్‌ కెహెచ్‌ పట్నాయక్‌ మాట్లాడుతూ.. పారిశ్రామిక రంగం, సేవల రంగం, మౌలిక సదుపాయాల్లో కొనసాగుతున్న పెట్టుబడుల వల్ల ఈ బలమైన వృద్ధి చోటు చేసుకునే అవకాశం ఉందన్నారు.

అయితే ఈ వృద్ధి గమనాన్ని నిలబెట్టుకోవాలంటే నిరంతర విధాన మద్దతు, స్థిరమైన మూలధన ప్రవాహాలు, బాహ్య దేశీయ ప్రమాదాలను ఎదుర్కొనే దిశగా సకాలంలో నిర్మాణాత్మక సంస్కరణలు అవసరమన్నారు. ఆర్థిక సంవత్సరం 2024-25లో తెలంగాణ 8.1 శాతం వృద్ధితో.. దేశ జీడీపీ సగటు 6.5 శాతాన్ని అధిగమించిన విషయాన్ని వారు గుర్తు చేశారు. దేశంలో ఏడు రేటింగ్‌ ఎజెన్సీలు ఉన్నాయని.. అందులో తమది ఒక్కటన్నారు. ఈ సమావేశంలో ఆ సంస్థ డైరెక్టర్‌,రీసెర్చ్‌ హెడ్‌ రాజీవ్‌ శరన్‌, ఏపీ, తెలంగాణ హెడ్‌ భాస్కర్‌ రెడ్డి జి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -