Tuesday, July 8, 2025
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణకు జాతీయ, అంతర్జాతీయ క్రీడల నిర్వహణకు అవకాశం ఇవ్వాలి

తెలంగాణకు జాతీయ, అంతర్జాతీయ క్రీడల నిర్వహణకు అవకాశం ఇవ్వాలి

- Advertisement -

ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి 
నవతెలంగాణ – ఆలేరు 
: తెలంగాణ రాష్ట్రంలో జాతీయ అంతర్జాతీయ స్థాయి క్రీడలు నిర్వహించడానికి అవకాశం ఇవ్వాలని కేంద్ర కార్మిక ఉపాధి యువజన సర్వీసులు క్రీడల శాఖ మంత్రి మానసిక్ మాంధవ్యను సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, డా.మల్లు రవి ఆదివారం ఢిల్లీలో కలిసి విజ్ఞప్తి చేశారు. ఖేలో ఇండియా గేమ్స్ లలో  భాగంగా 40వ జాతీయ క్రీడలను తెలంగాణలో నిర్వహించడానికి అవకాశం ఇస్తే అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు.

ఖేలో ఇండియా పథకం కింద క్రీడాకారులకు శిక్షణ, వసతి, ఆట స్థలాల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించాలని కోరినట్లు చెప్పారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో క్రీడాకారులకు ఉచితంగా రైల్వే ప్రయాణం చార్జీల్లో రాయితీ ఇచ్చినట్లుగానే ప్రస్తుతం కూడా ఇవ్వాలని అన్నారు. హై స్కూల్ స్థాయి నుండి విద్యార్థులు ఆటలో మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం నుండి ప్రత్యేక నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. వీరితో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (క్రీడలు) ఏ.పీ జితేందర్ రెడ్డి ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -