నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
జిల్లాలో మహిళల, బాలికల రక్షణకై పోలీస్ షీ టీమ్ ప్రత్యేక దృష్టి పెట్టి, తక్షణ స్పందనతో కాల్ చేసిన వారికి భరోసా, రక్షణ కల్పిస్తూ, ఆకతాయిలకు చెక్ పెడుతుందని, మహిళలు, బాలికలు ఎలాంటి వేధింపులకు గురైన నిర్భయంగా షీ టీమ్ నంబర్ 8712670312 కు కాల్ చేసి సేఫ్ గా ఉండాలని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మహిళలను, బాలికలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. షీ టీమ్ ప్రత్యేకంగా రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలలో, స్కూల్స్, కాలేజ్ (విద్యాసంస్థల) వద్ద పబ్లిక్ ప్రదేశాలలో సంచరిస్తూ మహిళలను, బాలికలను వేధిస్తున్న వారిపై దృష్టి సారించి తగు చర్యలు తీసుకుంటామన్నారు.
గడిచిన అక్టోబర్ నెలలో జిల్లా వ్యాప్తంగా షీ టీమ్ బృందం యువతులకు, విద్యార్థిని విద్యార్థులకు, పని స్థలాలలో మహిళలకు ప్రత్యేకంగా 16- అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, 103- హాట్స్పాట్ ల తనిఖీలు నిర్వహించడం జరిగిందని, అన్నారు. 02- పిటిషన్లు స్వీకరించి, 02-ఈ- పెట్టి కేసులు నమోదు చేసిందని, 13 మందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని, 13 మందిని వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించిందన్నారు.
ఆపద సమయంలో షీ టీమ్ ను సంప్రదించాలంటే 8712670312 నంబర్ కు ఫోన్ ద్వారా సంప్రదించాలన్నారు. షీ టీమ్ అవగాహన కార్యక్రమాలలో చైల్డ్ మ్యారేజ్, గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్ లపై, ప్రస్తుతం మహిళల పట్ల జరుగు నేరాలపై, చట్టాలపై, సైబర్ నేరాలపై మానవ అక్రమ రవాణా పై, సెల్ఫ్ డిఫెన్స్, టీ – సేఫ్, డయల్ 100, సోషల్ మీడియాలలో జరుగు నేరాలపై అవగాహన కల్పిస్తూ యువతను చైతన్య పరుస్తామన్నారు.



