Friday, August 29, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుఏకలవ్యలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు

ఏకలవ్యలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – వెల్దండ
వెల్దండ మండలం పరిధిలోని గుండాల గ్రామంలోని ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలో శుక్రవారం తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు భాష అభివృద్ధికి కృషి చేసిన గిడుగు రామ్మూర్తి   చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని ఇన్చార్జి ప్రిన్సిపాల్ కోడం భాస్కర్   వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తెలుగు భాషలో మొదటి అక్షరం “అ”ఆకృతిలో కూర్చుని, తెలుగు భాష పట్ల గౌరవాన్ని చాటారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ రీనా పాంచల్, ఉపాధ్యాయులు అనిల్, అవనీష్, వేద్ పాల్, దీపక్, చంద్రబాబు , ఇలియాస్, కీర్తి , అనీషా,గీతు, కవిత, అరుణ, అఖిల పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad