- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ నగరంలోని సరస్వతి నగర్ రోడ్ నెంబర్ 4 లో గల శబ్ద తరంగణి సంస్థ కార్యాలయంలో శుక్రవారం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సేర్ల దయానంద్ ఆధ్వర్యంలో తెలుగు భాష దినోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవం గా జరుపుకుంటారని తెలిపారు. వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి అన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్, సంతోష్, రాజబాపు, హరీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -