Monday, September 8, 2025
E-PAPER
spot_img
Homeసినిమాఅలాంటి కథల్లో 'తెలుసు కదా' ఒకటి

అలాంటి కథల్లో ‘తెలుసు కదా’ ఒకటి

- Advertisement -

కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న రొమాంటిక్‌ డ్రామా ‘తెలుసు కదా’. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. స్టైలిస్ట్‌ నీరజా కోన దర్శకత్వంలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్‌, కతి ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. తాజాగా హీరోయిన్‌ రాశీ ఖన్నా ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో ‘తెలుసు కదా’ జర్నీ గురించి రాశీ ఖన్నా మాట్లాడుతూ,’కెమెరాలు ఆగిపోయిన తర్వాత కూడా మరచి పోలేని కథలు ఉంటాయి. ‘తెలుసు కదా’ అలాంటి కథల్లో ఒకటి. అద్భుతమైన అనుభవాలన్నీ కలగలిసిన ప్రయాణం ఇది. ఈ ప్రయాణంలో నాతో పాటు నడిచిన అద్భుతమైన టీమ్‌కి కతజ్ఞతలు. మేము సష్టించిన ఈ ప్రపంచంలోకి మీరు అడుగుపెట్టే రోజు కోసం ఎదురు చూస్తున్నాను. ఇది మీకు ఒక గొప్ప రైడ్‌గా ఉంటుంది’ అని తెలిపారు.
ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్‌ 17న విడుదల కానుంది. సిద్దు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి, వైవా హర్ష
తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: నీరజ కోన, నిర్మాతలు: టిజి విశ్వ ప్రసాద్‌, కతి ప్రసాద్‌, సంగీతం: థమన్‌ ఎస్‌, డీఓపీ : జ్ఞాన శేఖర్‌, ఎడిటర్‌: నవీన్‌ నూలి, ప్రొడక్షన్‌ డిజైనర్‌: అవినాష్‌ కొల్లా.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad