నవతెలంగాణ – మద్నూర్: జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు అన్న ప్రసాదానికి సహకరిస్తూ మంగళవారం అన్న ప్రసాదంలో పాల్గొంటూ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినందుకు శ్రీ లక్ష్మీనారాయణ ఆలయ కమిటీ చైర్మన్ సందుర్వార్ హనుమాన్లు శాలువతో ఘనంగా సత్కరిస్తూ.. శ్రీ లక్ష్మీ నారాయణ విగ్రహాల ఫోటోను ఎమ్మెల్యేకు బహుకరించారు. ఆలయ అభివృద్ధికి ఇలాగే మీ సహాయ సహకారాలు అందించాలని కమిటీ తరపున చైర్మన్ ఎమ్మెల్యేకు విన్నవించారు. చైర్మన్ విన్నపానికి ఎమ్మెల్యే ఆలయం కోసం అభివృద్ధికి ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తానని రూ.25 లక్షల నిధులు ఆలయ అభివృద్ధికి మంజూరు చేయించడం జరుగుతుందని తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఆలయ కమిటీ సభ్యులు ఆలయ పూజారి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు ఫోటోను బహూకరించిన ఆలయ కమిటీ చైర్మన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES