Thursday, October 30, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఆలయాభివృద్ధి పనులు పూర్తి చేయాలి

ఆలయాభివృద్ధి పనులు పూర్తి చేయాలి

- Advertisement -

సీఎం ప్రిన్సిపల్‌ సెక్రెటరీ కేఎస్‌ శ్రీనివాస రాజు
మేడారంలోని సమ్మక్క సారలమ్మ దేవాలయ పనుల పరిశీలన


నవతెలంగాణ – ములుగు
వచ్చే సంవత్సరం జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు జరగనున్న మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర సందర్భంగా చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన, నాణ్యతతో పూర్తి చేయాలని సీఎం ప్రిన్సిపల్‌ సెక్రెటరీ కేఎస్‌ శ్రీనివాసరాజు అధికారులను ఆదేశించారు. బుధవారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క-సారలమ్మ వనదేవతలను జిల్లా కలెక్టర్‌ టీఎస్‌ దివాకర, ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ మోహన్‌ నాయక్‌తో కలిసి ఆయన దర్శించుకున్నారు. అనంతరం అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరాజు మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేయనున్న ప్రాంగణం పనులు, పలుచోట్ల చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు.

గుత్తేదారులు చేపట్టిన ఆయా పనులను సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ నాణ్యత లోపించకుండా జాగ్రత్త పడాలని, సమ యానికి అన్ని పనులను పూర్తి చేయాలని సూచించారు. మేడారం వన దేవతలను దర్శించుకోవడానికి వస్తున్న భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా పనులు చేపట్టాలని సూచించారు. ప్రస్తుతం చేస్తున్న పనులు శాశ్వ తంగా నిలిచిపోయేలా ఉండాలని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేష్‌, ఆర్‌అండ్‌బీ, పీఆర్‌, ఎలక్ట్రిసిటీ ఇంజనీరింగ్‌ అధికారులు, కాంట్రాక్టర్‌, ఎండోమెంట్‌ అధికారులు, పూజారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -