- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మూడు రాష్ట్రాలకు పూర్తిగా సరిహద్దులో గల మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంజనేయస్వామి ఆలయ హుండీ లెక్కింపు ఈనెల 21న శుక్రవారం జరగవలసి ఉంది. అయితే అనివార్య కారణాల వలన లెక్కింపు వాయిదా వేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి పి శ్రీధర్ ఒక ప్రకటన ద్వారా విలేకరులకు తెలిపారు. సమస్త భక్తులు అధికారుల సూచనలను అర్థం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఉండి లెక్కింపు జిల్లా అధికారుల సూచనల మేరకు మళ్లీ తేదీని ప్రకటించడం జరుగుతుందని తెలిపారు.
- Advertisement -



